హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమం మంచి సత్ఫలితాలను ఇచ్చింది. 24 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి తీసుకుపోయే ప్రయత్నంలో హరితహారం కార్యక్రమం ఎంతో తోడ్పాటును అందించింది. హరితహారం అమలుతో ఈ ఎనిమిదేండ్ల కాలంలో 8.2 శాతం గ్రీనరీని పెంపొందించుకోగలిగాం. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. తెలంగాణ ఆకుపచ్చగా మారింది.
అయితే తాజాగా విడుదలైన పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచీ(ఎన్విరాన్మెంటల్ పెర్ఫామెన్స్ ఇండెక్స్-ఈపీఐ)లో భారత్ అట్టడగున నిలిచింది. 180 దేశాలపై చేసిన సర్వేలో మనదేశం చివరి స్థానంలో ఉన్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ సూచీలో భారత్ అట్టడుగున నిలవడంపై సీరియస్గా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలని సూచించారు. మన భవిష్యత్ తరాలను నిరాశపరచొద్దు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
India ranked at the bottom at 180!
This report calls for serious introspection & an action plan in the lines of #HaritaHaaram in #Telangana on the part of all state Governments & Centre as well
We cannot afford to let down our future generations#EnvironmentalPerformanceIndex pic.twitter.com/4db2IA9XhX
— KTR (@KTRTRS) June 9, 2022