Adilabad | హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆరు రోజుల క్రితం అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.
అదృశ్యమైన విద్యార్థిని జాదవ్ నికేత్గా గుర్తించామన్నారు. నార్నూర్ మండల పరిధిలోని మహాగావ్ గ్రామవాసి అని గురుకుల అధికారులు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి తరగతులకు హాజరు కావడం లేదని, హాస్టల్లో కూడా ఆహారం తినడం లేదని తెలిపారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుమారుడి అదృశ్యంపై నికేత్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్టల్లో భద్రత పెంచాలని అధికారులను కోరారు.