BRS Party | తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఆయా రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పొద్దున్నుంచి రాత్రి వరకు విరామం లేకుండా నాయకులు ప్రచారంలో మునిగి పోతున్నారు. ఈ ప్రచార పర్వంలో కళాకారుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అధికార పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన గులాబీ జెండానే రామక్క అనే పాట పల్లెల నుంచి పట్నం దాకా మార్మోగిపోతోంది. ఎక్కడా చూసినా ఆ పాటనే వినిపిస్తోంది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాలోనూ గులాబీ జెండాలే రామక్క పాట హోరెత్తుతోంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అమెరికా వీధుల్లో గులాబీ జెండాలే రామక్క పాటకు స్టెప్పులేస్తున్నారు. పాలమూరు ఆడపడుచులు ఆలపించిన గులాబీ జెండాలే రామక్క పాటకు.. అమెరికా స్టైల్‌కు తగ్గట్టు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అమెరికా వర్షన్లో రామక్క సాంగ్‌కు స్టెప్పులేయడం సూపర్ అని కేటీఆర్ అన్నారు. ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Loved this US version of “Ramakka” ❤️
Thanks Guys for the love 💕 #Vote4Car #TelanganaWithKCR pic.twitter.com/KANDEJOkqu
— KTR (@KTRBRS) November 1, 2023