హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తనను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. దీంతో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కల్పించుకోగా.. కేటీఆర్ మాట్లాడుతూ.. మా భట్టి విక్రమార్క చాలా మంచివారు. దురదృష్టం ఏందంటే ఆ పార్టీలో భట్టి విక్రమార్కది నడుస్తలేదు. అక్కడ గట్టి అక్రమార్కులు ఉన్నారు. వాళ్లది మాత్రమే నడుస్తోంది పాపం. ఇది దురదృష్టమని కేటీఆర్ అన్నారు.
సభలో లేని నాయకుడి గురించి మాట్లాడటం సరికాదని భట్టి అభ్యంతరం వ్యక్తం చేయగా, కేటీఆర్ స్పందించారు. తాము పేరు ఎక్కడ ఉచ్చరించలేదని, కాంగ్రెస్ అధ్యక్షుడు అని మాత్రమే పేర్కొన్నట్లు కేటీఆర్ తెలిపారు. దక్షత కలిగిన నాయకుడు అని భట్టిని పొగడటం తప్పా అని అడిగారు. మీరెవర్ని వెనుకేస్తున్నారో ఆలోచించాలని భట్టికి సూచించారు. ఒక అక్రమార్కుడిని వెనుకేసుకురావడం సరికాదన్నారు కేటీఆర్.