హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికైనా రైతులే మొదటి ప్రాధాన్యం అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2014 నుంచి రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు. దీనికి అదనంగా రైతుబంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాలో రూ.65 వేల కోట్లు జమ చేశామని శనివారం ట్వీట్ చేశారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా 300 పేపర్ బ్యాగులను తయారు చేసిన ఇద్దరు విద్యార్థులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. ఆదివారం శుభకార్యం సందర్భంగా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఈ బ్యాగులను తయారు చేసినట్టు పిల్లల తండ్రి చల్లా రాము తెలిపారు.