Telangana | హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్( Sarpanch ) నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి( Chief Minister ) వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని తేల్చిచెప్పారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ( Agriculture University )లో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం( Telangana State ) వచ్చిన తర్వాత ఏడాదిన్నర పాటు పని చేశాను అని కేటీఆర్ తెలిపారు. గ్రామీణ నేపథ్యం గురించి తనకు చాలా తక్కువ తెలుసు. పల్లెలకు ఏం కావాలి. పల్లెల్లో ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రికి బాగా తెలుసు. సర్పంచ్ కంటే ఎక్కువగా కేసీఆర్ ఆలోచిస్తారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి.. పల్లెలను అభివృద్ధి చేస్తున్నారు. పల్లెకు, పల్లె ప్రజలకు ఏం కావాలో కేసీఆర్( KCR )కు తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికి తెలియదు. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ఐఆర్డీ( NIRD )లో శిక్షణకు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఏం విధులు నిర్వహించాలో అధ్యయనం చేశారు. తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదు. మన దేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఐదు అంచెలుగా ఉంది. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు. ఎంపీటీసీ( MPTC )లు గ్రామాలకు మండలానికి మధ్య సమన్వయకర్తగా ఉండాలి. జడ్పీటీసీ( ZPTC )లు మండలానికి, జిల్లా పరిషత్‌కు మధ్య సమన్వయకర్తగా ఉండాలి. ఐదంచెల వ్యవస్థలో ఎవరి పాత్ర ఏంటని తెలుసుకోనంత కాలం.. ప్రజాప్రతినిధులైనా, వ్యవస్థ అయినా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో( Elections ) గెలవాలనే ఆరాటంతో అనేక హామీలు ఇస్తాం. ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ సెక్రటరీ( Panchayat Secretary ) పోస్టు ఖాళీ అయితే తక్షణమే భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు రాష్ట్రంలో పని చేస్తున్నారు. తెలంగాణలో గ్రామాలు ఎలా ఉన్నాయి. వారి సొంత రాష్ట్రాల్లో గ్రామాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మాటలు మాట్లాడితే సరిపోదు. ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సంకల్పం ఉండాలి. రాష్ట్ర ఏర్పాటుతోనే వికేంద్రీకరణ ఆగలేదు. అంతటితో ఆగకుండా 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకున్నాం. 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో సూక్ష్మంగా పని చేసేందుకు వీలు కలిగింది. వికేంద్రీకరణ వల్ల వేగంగా పనులు జరుగుతాయి. ఇప్పటి వరకు 79 జాతీయ అవార్డులు గెలుచుకున్నాం. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.