KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహాలు ఎదురవుతాయి. సామర్థ్యం కలిగిన కొంత మంది నాయకులకు దురదృష్టవశాత్తూ టికెట్లు లభించలేదు. ఉదాహరణకు క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదు. వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.
I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections
Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏
Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,…
— KTR (@KTRBRS) August 21, 2023