స్కైరూట్ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు : మంత్రి కేటీఆర్
Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్ రేపు నింగిలోకి
హైదరాబాద్ : భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్.. స్కైరూట్ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ కొత్త చరిత్రను లిఖించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు కేటీఆర్.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్ సారాభాయ్ పేరుమీద దీనికి విక్రమ్-ఎస్ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు.
ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.
Heartfelt congratulations on treading new territory Team SkyRoot 👏
Immensely proud that an indian company and that too from Hyderabad has scripted history https://t.co/xlUtybHuOn
— KTR (@KTRTRS) November 18, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- ISRO
- Minister KTR
- skyroot
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

