హైదరాబాద్, అక్టోబరు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పులకరించే.. సింగిడి రం గుల పూల వైభవం, ప్రకృతి పరవశించే తీరొ క వర్ణాల బతుకు సంబురం అంటూ ఆదివారం ట్వీట్ చేశారు.
పువ్వులు, నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం, ఇచ్చిపుచ్చుకొనే వాయినాల అచ్చమైన ఆనంద పరిమళం, నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు అంటూ పేర్కొన్నారు. పంట చేనుల దారుల్లో పూలతేరులు, సమిష్టి సంసృతిని చాటిచెప్పే విశిష్ఠ వేడుక, తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.