హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతులను స్మరించుకున్నారు.
వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంపై కేబినెట్ మంత్రి కేటీఆర్ స్పందించారు.
రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికిపైగా రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఇలా ఎక్స్గ్రేషియా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం కూడా మరణించిన ఒక్కో రైతు కుటుబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు, రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని కేసీఆర్ చేసిన డిమాండ్లను కేటీఆర్ గుర్తుచేశారు.
Proud of Hon’ble @TelanganaCMO #KCR Garu for announcing ₹3 lakh ex gratia to all the 750 plus farmers who lost lives fighting the #FarmLaws in NCR 👍
— KTR (@KTRTRS) November 20, 2021
He also demanded Govt of India to announce ₹25 lakh ex gratia to each farmer family & also withdraw all cases unconditionally