KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల సాగునీటి అవసరాలను తీర్చగలుతున్నామని శుక్రవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు.
లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి నది 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు 10 భారీ పంపింగ్ స్టేషన్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బాహుబలి మోటార్లతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు రిజర్వాయర్, ఎస్సార్ఎస్పీలోకి పంపింగ్ చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.
Telangana in any eventuality is keeping the clouds of worry at bay even with a delayed Monsoon, where the proficient powerhouse that is Kaleshwaram Lift Irrigation Project’s might is on full display
Lifting water from Godavari river at Laxmi Barrage from 88 metres to the… pic.twitter.com/VHJdMWmwV1
— KTR (@KTRBRS) July 7, 2023