KTR | హైదరాబాద్ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. వివిధ విభాగాల్లో కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ 13 దక్కించుకొని మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ 13 అవార్డులను దక్కించుకోవడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లే పల్లె ప్రగతి విజయవంతమైందన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలు సత్తా చాటడం ఎంతో ఆనందంగా ఉన్నారు. 46 అవార్డుల్లో 13 అవార్డులు సొంతం చేసుకోవడం.. తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
‘పల్లె ప్రగతి’ విజయం…KCR గారి విజన్
జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా.. 13 అవార్డులు సొంతం..!
తెలంగాణ ధమాకా..
46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 మనవేజాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ… pic.twitter.com/fxUg2aU4PP
— KTR (@KTRBRS) April 18, 2023