హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే ముఠ గోపాల్ పాల్గొన్నారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే.