కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని, ఇప్పుడు యాసంగి ధాన్యం కొనబోమంటూ కేంద్రం నాటకాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ ముందే సూచించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ, కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తమదేనని చెప్పి రైతులతో గల్లీ బీజేపీ నాయకులు వరివేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనబోమని ఢిల్లీ బీజేపీ మొండికేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆగంజేసిన బీజేపీ నాయకులను తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
యాసంగి వడ్లు కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని ముందే రైతులకు సూచించిన కెసిఆర్ !!
రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగీ ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది!
ఇది *అన్నదాత పోరాటం మాత్రమే కాదు* ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం* pic.twitter.com/zrmOpSWQZ4
— KTR (@KTRTRS) April 9, 2022