Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Telangana State Formation) గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉన్నాయని కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు మీద మోడీ తన అక్కసు వెళ్లగక్కడం, అవమానకరంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని ఆయన చెప్పారు. అంతేకాదు చారిత్రక వాస్తవాల పట్ల మోడీ నిర్లక్ష్య ధోరణికి అతడి మాటలు అద్దం పడుతున్నాయని మంత్రి తెలిపారు.
స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా నిర్విరామంగా కొట్లాడరని, చివరకు 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రం సాకారమైందనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు రాష్ట్ర సాధన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారని, ముఖ్యంగా తెలంగాణ యువత పాత్ర మరువలేనిదని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మనం నిర్వహించుకోలేదనడం పూర్తి అవాస్తవం.
I am deeply dismayed by Prime Minister @NarendraModi ji’s comments regarding the formation of Telangana state
This is not the first instance where the PM has made disparaging remarks about Telangana formation, and it reflects his utter disregard for historical facts
The people… https://t.co/EeKVRXNxDK
— KTR (@KTRBRS) September 18, 2023
మరోవిషయం ఏంటంటే.. కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నంలో ప్రధాని పదే పదే తెలంగాణ ప్రజల మనోభావాలను అగౌరపరుస్తున్నాడని మంత్రి తెలిపారు. ముఖ్యమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు సన్నితమైన, చారిత్రక విషయాలను ప్రస్తావించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమగ్ర అవగాహన ఉంటేనే మాట్లాడాలని మంత్రి కేటీఆర్ ప్రధానికి సూచించారు.