అల్లాపూర్, డిసెంబర్ 23: కూకట్పల్లి మండలం అల్లాపూర్ డివిజన్లోని సర్వే నం. 1,002లోని 12గంటల భూమి కబ్జాకు యత్నించిన నిందితులపై పోలీసులు కేసు న మోదు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ సోదరుడు సంతోష్‌గౌడ్ అనుచరులు గత శుక్రవారం బుల్డోజర్తో వచ్చి ఫె న్సింగ్ తొలగించిన ఘటన స్థానికంగా కలకలం రేపగా ఇదే అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘ప్రైవేట్ స్థలంపై కాంగ్రెస్ నేతల కన్ను’ శీర్షికన శనివారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు తీసిన వీడియో లు, ఫొటోల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తుమన్నామని అల్లాపూర్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపా రు. వీడియోల్లో ఉన్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తే అసలు నిందితులు బయటికి వచ్చే అవకాశమున్నదని బాధితులు తెలిపారు.
ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసులు
జహీరాబాద్, డిసెంబర్ 23 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కొల్లగొడుతున్న మాఫియాతో చేతులు కలిపిన అప్పటి జహీరాబా ద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రా వు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, భూకబ్జాదారులపై మూడు రోజుల క్రితం క్రిమినల్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వినోభాగౌడ్కు చెందిన 13 ఎకరాలను అభివృద్ధి చేస్తామని ప ట్లోళ్ల నర్సింహారెడ్డి, వేణుగోపాల్ సర్దా 2018 లో రిజిస్టర్ చేయించుకున్నారు. భూమి ని డెవలప్మెంట్ చేయకుండా కాలయాపన చేశారు. డీటీసీపీ లేఔట్ ప్రకారం వసతులు కల్పించకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్, సబ్రిజిస్ట్ట్రార్లు అబ్దుల్ హఫీజ్, పరంజ్యోతి సహకారంతో జీపీఏ చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బాధితుడు కోర్టులో కేసువేయడంతో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.