హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల ఈశ్వర్ చర్చించారు. ఈ సందర్భంగా హమాలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్, మాజీ సర్పంచ్ పొలగంటి మల్లయ్య, హమాలీ సంఘం అధ్యక్షులు ఒల్లాల శ్రీనివాస్, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.