నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో ఎట్టకేలకు జమానత్లు సమర్పించేందుకు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.
ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రూ.15 వేలు, ఇద్దరి చొప్పున జమానత్లను కోర్టు అంగీకరించి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.