వరంగల్, జూన్ 20 : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చి ట్ చాట్‌లో ఎమ్మెల్యే కడియంపై ఘా టు వ్యాఖ్యలు చేశారు. ‘కడియం శ్రీహ రి నలికుట్ల మనిషి.. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నడు. నా ముందు కూర్చోడానికి నామోషీగా ఫీల్ అవుతున్నడు. అందుకే నా మంత్రి ప దవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నడు’ అని ఆరోపించారు.
తర చూ సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద కు వెళ్లి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. ‘నాకు అదృష్టం ఉ న్నది.. మంత్రి అయిన. ఆయనకు అ దృష్టం ఉన్నప్పుడు ఆయన మంత్రి అ య్యిండు. మాటిమాటికి నేను దిగిపోవాలని మాట్లాడుడు మంచిదికాదు. నా కూతురుకు అదృష్టం లేదు.. ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురుకు అదృష్టం ఉన్నది ఎంపీ అయింది’ అని హాట్‌హాట్ కామెంట్లు చేశారు.