నీలగిరి, ఏప్రిల్ 17 : ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని, హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌ను పునాదులతో కూల్చేసి బీఆర్ఎస్ లేకుండా చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బీజేపీలోకి పోతున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండేండ్లయినా కవితకు బెయిల్ రాదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిని లిల్లీపుట్ కాదని, ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని, తాము అనుకుంటే బీఆర్ఎస్ లో ముగ్గురు మాత్రమే మిగులుతారని చెప్పారు.