Minister Komatireddy | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో అందరిముందు అడిగిన వాటన్నింటికి నిధులు ఇస్తానని చెప్తారని, కానీ, ఫైలు పట్టుకొని వస్తే మాత్రం నిధులు లేవని అంటారని రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వాపోయారు. శాసనసభలో సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆయన చాంబర్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. భట్టివిక్రమార్క గురించి చెప్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖంపైనే నిధులు లేవని చెప్పేవాడని, భట్టి విక్రమా ర్క మాత్రం ఇస్తామని చెప్పి ఇవ్వరని న వ్వుతూ చెప్పారు. తన సొంత గ్రామం బ్రా హ్మణవెల్లంలో నిర్మించిన ప్రాజెక్టు పూర్తికావడం తనకు జీవితకాలం ఆనందాన్ని ఇ చ్చిందని అన్నారు. దీనిపై భట్టి స్పందిస్తూ బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు పూర్తికావడంతో వెంకట్రెడ్డి జీవితం ధన్యమైందని చెప్పా రు. ఎస్ఎల్బీసీకి కూడా రూ. 92 కోట్లు మంజూరు చేశామని, జనవరిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆర్మూరులో జరిగిన రగడపై కోమటిరెడ్డి స్పం దిస్తూ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి లేకపోవడంతో ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థి వచ్చి సమస్యలను వేదికపై నుంచి చెప్పారని, అది ప్రొటోకాల్ సమస్య కానేకాదని అన్నారు.
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు.. అందరూ ప్రతి నెల ఒక్కొక్క హాస్టల్లో భోజనం చేయాలని నిర్ణయించామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, సీఎంతో సహా అందరూ హాస్టళ్ల బాటపడ్తారని భట్టి విక్రమార్క చెప్పారు.