హైదరాబాద్ : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం అమ్మిన డబ్బులు మూడు రోజుల్లోనే వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు. బుధవారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్రం లోనే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain purchase center) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నల్గొండ జిల్లాలో గత సీజన్లో సైతం ధాన్యం కొన్న మూడు రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేశారని గుర్తు చేశారు. వానకాలం ధాన్యానికి సంబంధించి రైతులకు ఏవైనా ఇబ్బం దులు ఏర్పడిన లేదా చెల్లింపులు ఆలస్యమైన జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యే కించి సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ సైతం ఇస్తున్నదని పేర్కొన్నారు.
గ్రేడ్ -ఏ ధాన్యానికి క్వింటాలుకు 2320 రూపాయల మద్దతు ధర, సాధారణ రకానికి 2320 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించిందన్నారు. మిల్లర్లు సన్న బియ్యంతో పాటు, దొడ్డు రకానికి సైతం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా దొడ్డు ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వారి రుణాలను వారం పది రోజుల్లో రుణమాఫీ(Loan waiver) చేయనున్నట్లు మంత్రి తెలిపారు.