హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అప్పులపై తాను వెల్లడించిన వివరాలు నిజం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెప్పిస్తే తన పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి చెప్పారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఉదయం 11 గంటలకే కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌రావుకు తాను లేఖలు రాసి పంపినట్టు చెప్పారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఎంత అప
్పు చేసిందని తాను మాట్లాడలేదని, బీఆర్ఎస్ హ యాంలో ఎంత అప్పు చేశారనే విషయాన్నే మాట్లాడానని చెప్పారు. ప్రెస్‌క్లబ్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వస్తారని మూడు కుర్చీలు వేశానని, కానీ వాళ్లు రాలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులు, బకాయిలు రూ.8.21 లక్షల కోట్లు అని లేఖలో రాశానని, 4 పేజీల్లో పూర్తి వివరాలు పేర్కొన్నట్టు చెప్పారు. అప్పుల చిట్టా ను వాట్సాప్‌లో పంపించానని, తాను పంపిన లెక్కలు తప్పయితే రాజీనా మా చేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. అప్పు రూ.8 లక్షల కోట్లు అని కేంద్రమే చెప్పిందని తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రాకుండా బీఆర్ఎస్ నేతలే విఫలమయ్యారని ఆరోపించారు.
రాష్ట్ర అప్పులు, గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చలకు పిలిచి బీఆర్ఎస్ నేతలు పారిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. చర్చలకు రాకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులతో అరెస్ట్ చేయించేంత పిరికివాళ్లం కాదని, తమకంటూ క్రెడిబిలిటీ ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నందునే హరీశ్‌రావు చేసిన ఫోన్ ఎత్తలేకపోయామని తెలిపారు.