సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ అత్యంత సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ర్టాల్లో పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం క్షుద్ర రాజకీయాలు చేస్తూ ధాన్యం కొనకుండా తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తుందని విమర్శించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నదే రైతాంగం కోసం అయినందున దేశంలోనే ఎక్కడా లేని విధంగా
కాగా, ధాన్యం కొనుగోళ్ల విషయమై తమదే విజయమంటూ ప్రతిపక్షాలు జబ్బలు సర్సుకుంటూ ప్రజల్లో కమెడియన్లుగా మారారని ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ రైతులకు ద్రోహం చేసినా సీఎం కేసీఆర్ కేంద్ర బాధ్యతను తన భజస్కందాలపై వేసుకొని మనమే కొందామని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాలు, ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేవని పేర్కొన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ మానవీయ కోణంతో ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.