స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొకలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట శివారు రంగనాయక సాగర్ సమీపంలోని తేజోవనంలో మొక్కలు నాటి నీళ్లుపోశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృక్షార్చన కార్యక్రమం ఉద్యమంలా సాగిందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.
– సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి