Minister Harish Rao | తెలంగాణలో వరుసగా రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రతమత్తమైంది. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్యసేవలు సూచించింది. మరో వైపు ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణులను గుర్తించి.. వారిని ముందే ఆసుత్రికి తరలించి వసతి కల్పించాలని సూచించారు. ప్రజల్ని కాపాడేందుకు అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.