హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా సాగిన తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రయా ణం యావత్తత్తు దేశానికే అనుసరణీయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్వీట్ చేశారు. కేసీఆర్ సకల జనుల ఇంటిదీపం అని కొనియాడారు. స్వరాష్ట్రంలో చేతి వృత్తులకు పూర్వవైభవం వచ్చిందని పేర్కొన్నారు.
‘బోసినవ్వుల తల్లికి పెద్దకొడుకు కేసీఆర్..
ఒంటరి మహిళ బతుకు భరోసా కేసీఆర్..
దివ్యాంగుడి దివ్యపదం కేసీఆర్..
నేతన్న గీతన్నలకు కుడిభుజం కేసీఆర్..
సకల వృత్తుల.. సకల జనుల
ఇంటి దీపం కేసీఆర్..
సంక్షేమ కాంతికి నిజమైన
సంతకం కేసీఆర్..’ అని
హరీశ్‌రావు ట్వీట్ చేశారు.