భువనగిరి: మంత్రి హరీశ్ రావు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీబీనగర్‌లోని ఎయిమ్స్ దవాఖానను సందర్శిస్తారు. 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ (DPCU)ను ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ సేవల విభాగం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భువనగిరిలోని వీకేర్ హాస్పిటల్ (ఫిజియోథెరపీ, డయాగ్నోస్టిక్)ను ప్రారంభిస్తారు. 12.30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.