Harish Rao | సిద్దిపేట, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా గద్దె దింపుతామని స్పష్టంచేశారు. 2024 తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి పుష్కలంగా నిధులు తెచ్చుకొంటామని చెప్పారు. ‘రేపు కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్నా కచ్చితంగా సీఎం కేసీఆర్ మద్దతు లేకుండా సాధ్యం కాదు. ఇన్ని రోజల నుంచి మన రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఎలా ఆపారో.. ఆ నిధులను వడ్డీతో సహా తెచ్చుకొంటాం’ అని తేల్చిచెప్పారు. సిద్దిపేట మెట్రో గార్డెన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అంగన్వాడీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేటలో ఆశ కార్యకర్తలు, రైస్ మి ల్లర్ల అసోసియేషన్, పలు కుల సంఘాల స మావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.1.10 లక్ష్యల కోట్లను కేంద్రం రెండేండ్లుగా ఆపిందని విమర్శించారు.
కమ్యూనిస్టులను నమ్మొద్దు
అంగన్వాడీల్లో 600 మందికి ప్రమోషన్లు ఇచ్చామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని జిల్లాలో ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. అంగన్వాడీల వేతనాల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ‘మీరు కూడా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలుంటాయి.. సీపీఐ, సీపీఎం వాళ్ల యూనియన్ల కోసం మిమ్మల్ని రోడ్ల మీదికి తెస్తారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని బలం చూపించే కుట్ర చేస్తారు. ఆ పార్టీలకు మనుషులు లేరు, కార్యకర్తలు లేరు. ఏమన్నా అంటే అంగన్వాడీలను, ఆశ వర్కర్లను రోడ్ల మీదికి తెచ్చి మధ్యలో వాళ్ల జెండా పడుతరు. ఆ ఉచ్చులో పడి నష్టపోవద్దు. ఆ పార్టీలు మిమ్మల్ని రాజకీయాల కోసం వాడుకొంటున్నాయి. సీఎం కేసీఆర్ మనసు చాలా పెద్దది..చారానా ఉంటే ఆఠనా కోసం ఆలోచించే మనిషి.. ఎంత వీలైతే అంత మంచి చేయాలని పరితపిస్తారు. ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు. అంగన్‌వాడీలవి గొంతెమ్మ కోరికలేమీ కావు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఇది మీ ప్రభుత్వం.. మమ్మల్ని దీవించండి.. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపడుకొంటాం’ అని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.
హరీశ్‌రావుకే మా ఓటు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకే ఓటువేస్తామని వీరశైవ బలిజ సమాజం తీర్మానం చేసింది. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన వీరశైవ బలిజ సమాజ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్‌పై రూ.కోటితో బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటుచేశామని, బసవేశ్వర భవన నిర్మాణానికి రూ.20 కోట్ల స్థలం, రూ.10 కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే బసవేశ్వరుడికి గుర్తింపు వచ్చిందని, అధికారికంగా ఆ మహాత్ముడి జయంతి నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు. సిద్దిపేటలో తర్వలోనే బసవేశ్వర భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ పథకాల కోసం బీజేపీ రాష్ర్టాల్లో ఒత్తిడి
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను బీజేపీ పాలి త రాష్ర్టాల్లో అమలుచేయాలని అక్కడి ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్తు వంటి పథకాలు మీరెందుకు ఇవ్వరని బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నిలదీయటం ప్రారంభించారని చెప్పారు. ‘తెలంగాణలోమాదిరిగా మా కూ రైతు విధానం కావాలి. తెలంగాణ ఉద్యోగుల్లా వేతనాలు కావాలి. రైతుబీ మా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావా లి అని ప్రజలు అడుగుతున్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కట్టడి చేయాలని కక్ష గట్టి ఇబ్బంది పెడుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని హుకుం జారీ చేసింది. అందు కు నిరాకరించినందుకు ఎఫ్ఆర్బీఎం కింద మనకు రావాల్సిన 21 వేల కోట్లు ఆపింది. ఎఫ్ఆర్బీఎంలో ఏకపక్షంగా రూ.34 వేల కోట్లు కోత పెట్టింది. వెనుక బడిన జిల్లాలకు రావాల్సిన రూ.1,800 కోట్లు అగిపోయాయి. ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఏ పథకాన్నీ ఆపకుండా అమలుచేస్తున్నాం’ అని తెలిపారు.