గజ్వేల్: కాంగ్రెస్ (Congress) హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. హస్తం పార్టీ పాలనలో మోటార్లకు 3 గంటలే కరెంటు (Congress) వచ్చేదని విమర్శించారు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కరెంటు కోతలు తప్పవన్నారు. గజ్వేల్‌లో (Gajwel) కొత్తగా నిర్మించిన రింగు రోడ్డును, పత్తి మార్కెట్ యార్డు, సబ్‌స్టేషన్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రేమ ఉన్న ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ (CM KCR) మాత్రమేననన్నారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏండ్ల నీటి కష్టాన్ని ముఖ్యమంత్రి తొలగించారని చెప్పారు. దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ఠ నిలబెట్టిన ఘనత సాధించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Harishrao 1