హైదరాబాద్: నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్పారు. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయిందని తెలిపారు. మిషన్ అమృత్ సరోవర్ (Mission Amrit Sarovar) పేరుతో మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని ట్వీట్ చేశారు.
‘నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం.. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
నాడు ఎండి పోయిన చెరువులు..
నేడు నిండు కుండల్లా చెరువులు..నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం..
నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవంఅందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది. అమృత్ సరోవర్ గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది.… pic.twitter.com/zZqi6TyZqE
— Harish Rao Thanneeru (@BRSHarish) June 8, 2023