Minister Harish Rao | మంచిర్యాల : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth reddy ) పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ( Telangana )లో ఛత్తీస్‌గఢ్( Chhattisgarh ) పాలన అమలు చేస్తామన్న రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ ప్రజల మాదిరిగా మన రాష్ట్ర ప్రజలు కూడా వలస పోవాలా? అని మంత్రి ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్( BRS ) సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ( BJP ), కాంగ్రెస్( Congress ) నాయకులు సొల్లు మాటలు చెబుతున్నారు. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఒక్క మంచి పని చేసే ప్రయత్నం చేయడం లేదు. మన కేసీఆర్( KCR ) చేసిన మంచి పనులు కళ్ల ముందు ఉన్నాయి. ఇది మన కేసీఆర్ గొప్పతనం. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణలో ఆ రాష్ట్ర పాలన అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఛత్తీస్‌గఢ్‌లో ఎంత పెన్షన్ వస్తుంది రూ. 500. అంటే తెలంగాణలో ఇస్తున్న రూ. 2016 పెన్షన్ వద్దా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో యాసంగిలో వడ్లే కొనరు. వానా కాలంలో 15 క్వింటాళ్లు మాత్రమే కొంటారు. ఇది ఛత్తీస్‌గఢ్ పాలన. మన కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేయడంతో పాటు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొంటున్నామని తెలిపారు. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేయాలంటే ఎన్నో తంటాలు పడ్డారు. ఎరువులకు, విత్తనాలు దొరక్క ఇబ్బంది పడేవారు. కరెంట్ కోసం తంటాలు, పండిన పంట అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోయేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గింజను కొంటున్నాం. ఇది మన కళ్ల ముందు కనబడుత లేదా..? అని హరీశ్‌రావు అడిగారు. ఛత్తీస్‌గఢ్, బీహార్ నుంచి తెలంగాణకు వలస వస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందుకే ఇక్కడికి వస్తున్నారు. రేపు తెలంగాణలో ఛత్తీస్‌గఢ్ పాలన అమలైతే.. మనోళ్లు కూడా వలస పోవాలా? అని ప్రశ్నించారు.
ఎవరూ దరఖాస్తు పెట్టకముందే.. రైతుబంధు, దళిత బంధు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు అయిండు మన కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. దళిత బంద, రైతు బంధు ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. సమాధులు తవ్వేటోడ కావాల్నా.. పునాదులు వేసేటోడు కావాల్నా ఆలోచించండి.. కేసీఆర్ ఈ కొత్త రాష్ట్రానికి బలమైన పునాదులు వేసిండు. కేసీఆర్ వేసిన బలమైన పునాదులు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మన పథకాలను కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు కాపీ కొట్టాయి. తెలంగాణ ఇవాళ ఏం చేస్తదో.. రేపు దేశం అదే చేస్తుందని స్థాయికి కేసీఆర్ పరిపాలనను తీసుకెళ్లాడు. తెలంగాణ ఆచరిస్తుంటే కేంద్రం అనుసరిస్తుందని హరీశ్‌రావు తెలిపారు.