హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గెలిచేది.. నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ది బలుపు కాదు వాపేనని విఫలమైన వారి సభలు రుజువు చేశాయి. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా కేసీఆర్‌కే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో కేసీఆర్‌పై తెలంగాణ ఏక పక్షంగా తన అభిమానాన్ని చాటుకోబోతున్నది.
మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎం చేయాలని తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు. ప్రచారంలో కష్టపడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించి బీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణను సాధించి, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా ఆశీర్వదించాలని మరొకసారి కోరుతున్నాను. జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినదించారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తున్నది. జై తెలంగాణ, అభివృద్ధికే ఓటు వేస్తామని నెటిజన్లు రీట్వీట్లు పెట్టారు.