కంది, ఫిబ్రవరి 27: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మంచి ఫలితాలు సాధించాలని సంగారెడడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌లోని కేజీబీవీ, యూపీ పాఠశాలలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవిలో తరగది గదులను పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డించే భోజనం, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అంతకు ముందు ప్రాథమికోన్నత పాఠశాల, ఫైలెట్ ప్రాజెక్టు కింద నడుస్తున్న ప్రీ ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో నలుగురే విద్యార్థులుండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలకు ప్రహరీ లేక ఇబ్బందికరంగా ఉందని హెచ్ఎం వాసీమ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈజీఎస్‌లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్ధార్ కిరణ్‌కుమార్, ఆర్ఐ రంగయ్య, ఎంఈవో జోగప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.