31న శ్రీవారి ఆలయానికి భూమి పూజ
కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, హైదరాబాద్ టీటీడీ సలహామండలి అధ్యక్షుడు భాసర్‌రావు శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి 10 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వివరించారు.
- ఈవో ధర్మారెడ్డితో మంత్రి గంగుల,బీ వినోద్‌కుమార్ సమావేశం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, హైదరాబాద్ టీటీడీ సలహామండలి అధ్యక్షుడు భాసర్‌రావు శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి 10 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వివరించారు. కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండేలా టీటీడీ చకటి ఆలయాన్ని నిర్మించాలని వారు ఈవోను కోరారు.
భూమి పూజకు ముందుగా ఈ నెల 22న టీటీడీ అర్చకులు భూకర్షణం (గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్నుతారు. అకడ నవధాన్యాలు చల్లుతారు. ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు. ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని ఈవో తెలిపారు. 31న భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి చెప్పారు. టీటీడీ అర్చకులు, సిబ్బందికి అన్ని వసతులూ కల్పిస్తామని పేర్కొన్నారు. భూమిపూజకు రావాల్సిందిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈఓ ధర్మారావును ఆహ్వానించారు. సమావేశంలో తెలంగాణ టీటీడీ బోర్డు అడ్వయిజరీ కమిటీ చైర్మన్ భాసర్‌రావు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈ ఈ నరసింహమూర్తి, ఆగమ సలహాదారు మో హన రంగాచార్యులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు.
‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023’ ప్రచురణ ఆవిషరణ
‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023’ ప్రచురణను ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. 311 పేజీలున్న ఈ పుస్తకం ఖరీదు రూ. 350 కాగా సబ్సిడీపై విద్యార్థులకు రూ. 150కే అందించనున్నారు. ఆన్లైన్లో www. tsdps. telangana. giv. inలో ఆదివారం నుంచి అందుబాటులో ఉంటుం ది. అన్ని కలెక్టరేట్లలోని సీపీవో కార్యాలయంలో ఈ ప్రచురణలు దొరుకు తాయి. కార్యక్రమంలో ఎకనామిక్స్ స్టాటిస్టికల్ శాఖ డైరెక్టర్ జీ దయానంద్, టీఎస్‌డీపీఎస్ కార్యనిర్వాహక అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

