కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 26: కాంగ్రెస్, బీజేపీని నమ్మితే అధోగతేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వారికి అధికారమిస్తే ఉన్న పింఛన్లు ఆగిపోవ డం ఖాయమని చెప్పారు. శనివారం మంత్రి కరీంనగర్ కలెక్టరేట్లో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి పాలన సాగించే పార్టీలను ఆదరిస్తే గల్లీలోని సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. అందుకే బీఆర్ఎస్కు అండగా నిలువాలని ప్రజలను కోరారు. ఏ చిన్న సమస్య ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రికే ఫోన్ ద్వారా చెప్పుకొనే అవకాశం రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉంటుందని తెలిపారు.