బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 15:42:39

కరోనా స్ట్రెయిన్‌పై నిపుణుల కమిటీ సమావేశం

కరోనా స్ట్రెయిన్‌పై నిపుణుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా నిపుణుల కమిటీతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం కానున్నారు. కరోనా రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. కాగా, విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారికి ఎక్కడిక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో 60 శాతం మందిని గుర్తించారు. కాగా, బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించారు. కొత్త స్ట్రెయినా కాదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు చేయనున్నారు. 

ట్రేసింగ్, టెస్టింగ్‌, ట్రీట్మెంట్‌ పద్ధతిని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని డీఎంఈ రమేశ్‌ రెడ్డి అన్నారు. యూకే, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు. అలాంటివారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే.. సెకండ్‌ స్ట్రెయిన్‌ ఉంటే అలాంటివారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. 


logo