జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. ఒక్కసారి జనంలోకి వెళ్తే చాలు..ఆయన ప్రజలతో కలిసిపోతారు. వారి కష్ట సుఖాల్లో భాగం అవుతారు. ఇదే తరహాలో ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తున్నారు. దారిలో ట్రాక్టర్లో చెత్త ఎత్తుతూ పారిశుధ్య కార్మికులు మంత్రి కంటపడ్డారు.
వెంటనే మంత్రి తన కాన్వాయిని ఆపారు. కారు దిగి వాళ్లతో కలిసి చెత్త ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఈ ఘటన 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం వేములపల్లి లో ఆదివారం చోటు చేసుకుంది. కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్ తదితరులు ఉన్నారు.