హైదరాబాద్ : వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(Minister Errabelli)ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ(Mission Baghiratha) కార్యాలయంలో అధికారులతో సమీక్ష (Review )నిర్వహించారు.
ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, నీటి సరఫరా కు ఆటంకాలు లేకుండా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా జాగ్రత్త పడాలని,ఎండా కాలంలో కూడా నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలన్నారు. కరెంటు సమస్యలు వచ్చినా, నీటి సరఫరా ఆగవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు.
పంపుల మెయింటనెన్స్ సరిగా చేయాలని, పైప్ లైన్ లీకేజీ లు లేకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు.అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సీ, సీఈలు,ఎస్ఈ లు, ఈఈ లు, పాల్గొన్నారు.