హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిపాలన భవన సముదాయం సెక్రటేరియట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక దార్శనికుడు అంబేద్కర్ పేరును పెట్టడం చారిత్రాత్మకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నిర్ణయం రాష్ట్రానికి కాదు.. భారతదేశానికే గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినట్లుగా పార్లమెంట్ కొత్త భవనానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.