వరంగల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు బీమా, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు దేశానికే ఆందర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వడ్లు కొనడం చేతకాని బీజేపీ అడ్డగోలు రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా అమలులో ఉన్నాయా అని ప్రశ్నించారు. విమర్శలు చేసేముందు ప్రతిపక్షాలు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అంతకుముందు రాయపర్తి మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.