పాలకుర్తి (జనగామ ) : కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు కాదు కదా, కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేని దుస్థితి. కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ పాలకుర్తిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యలను ఖండించకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని అన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని చెప్పారు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు, రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. మూడు పంటలకు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ (BRS) కావాలా ? మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ (Congress ) కావాలా ? తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు.
‘ కేసీఆర్ (CM KCR ) సీఎం అయ్యాకే రైతుల కళ్లల్లో ఆనందం (Happy) కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాల అమలు అవుతున్నాయి. రైతుల కోసం ఇంతగా చేసిన ప్రభుత్వం గతంలో లేదు. భవిష్యత్తులో రాదని జోస్యం’ చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు అనుకూల నిర్ణయాలు, వ్యవసాయానికి సాయం చేసే విధంగా పథకాలు రూపొందించి అమలు చేస్తుండడంతో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని మంత్రి వివరించారు.
రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న రేవంత్ రెడ్డిని రైతులు నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమితి కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.