సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 22:33:59

ఎమ్మెల్యే గండ్ర మనుమడి జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి

ఎమ్మెల్యే గండ్ర మనుమడి జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి

హైదరాబాద్ :  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మనుమడు చిన్నారి మోహన్‌రాజ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరై చిన్నారి మోహన్‌రాజ్‌ రెడ్డిని ఆశీర్వదించారు. వెంకటరమణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి దంపతులకు మంత్రి దయాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.