హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఘోస్ట్ ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరించారు.విద్య ప్రమాణాలు దిగజారుతాయన్నారు.