హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్‌నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశమే లేదని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు.
దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వత్తాసు పలికారు. అజారుద్దీన్ మాటలకు సభికులు స్పందిస్తూ ‘మీరెప్పుడు మా వెంట ఉన్నారని’ అంటూ రన్నింగ్ కామెంట్ చేయటం వినిపించింది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి అజారుద్దీన్ ఓడిపోయారని, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించరు కాబట్టే ఆయన ఇలా బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు చెప్తున్నారు.