హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా హోంగార్డుల మృతి పట్ల ఆమె విచారం వ్యక్తంచేశారు. మరణించిన హోంగార్డులకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో శాలరీ అకౌంట్లు ఉండటంతో ప్రమాద బీమా మంజూరు కాగా.. సకాలంలో బెనిఫిట్లు అందించినందుకు బ్యాంకు సిబ్బందిని ఆమె అభినందించారు.