మంత్రి అడ్లూరికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్‌లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లారు.
- కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలో తెగిపడ్డ లిఫ్ట్
విద్యానగర్, మే 13 : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్‌లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లారు. దవాఖానలోని లిఫ్ట్ ఎకి మూడో ఫ్లోర్‌కి వెళ్లగానే ఒక్కసారిగా కేబుల్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. మంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఆయన దవాఖాన యాజమాన్యంపై మండిపడ్డారు.
బస్సు ఎక్కుతుండగా.. మరో బస్సు ఢీ
- ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం
ఆసిఫాబాద్ టౌన్, మే 13 : ఓ వృద్ధురాలు ఏడాదిన్నర వయస్సు గల మనుమడితో బస్సు ఎక్కుతుండగా మరో బస్సు వచ్చి ఢీకొనడంతో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్‌లో బుధవారం చోటుచేసుకున్నది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన వృద్ధురాలు తన మనుమడు తరుణ్ (18నెలలు)తో కాగజ్‌నగర్ వెళ్లేందుకు ఆసిఫాబాద్ బస్టాండ్‌లో బస్సు ఎకుతుండగా ఉట్నూర్ డిపోకు చెందిన మరో బస్సు రివర్స్ తీసుకుంటుండగా రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు. దీంతో బాలుడు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

