(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్ఎస్గా గుర్తించాలని ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేయనున్నారు. అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమి టి? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏయే నిబంధనలు అనుసరించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నదో పరిశీలిద్దాం.
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతున్నది.
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.