న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే వివాదానికి ముగింపు పలికేందుకు దౌత్యమే మార్గమని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తమ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఐరాస ప్రసంగంలో ఇరాన్‌పై యుద్ధాన్ని సమర్థిస్తూ, ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్‌కు శాంతియుత అణు సాంకేతికతను వినియోగించుకునే హక్కు ఉందని పెజెష్కియాన్ అన్నారు. అదే సమయంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు వద్దని, కానీ శాంతియుత అణు సాంకేతికతపై పరిమితులను అంగీకరించబోమని తెలిపారు. ఇతర దేశాల అనుమతి తీసుకోకుండా తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు.
అమెరికాకు వార్నింగ్ ఇచ్చేందుకు జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ ఏకంగా బాలకృష్ణ మూవీతో మీమ్ క్రియేట్ చేసింది. ఆ పోస్టులో.. ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేయాలని అనుకుంటున్నారని.. కానీ ఇరాన్ బలం ఏంటో చూపించడంతో ఆయన హాలీవుడ్ సినిమాలు చూడటం మానేసి బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారంటూ ఇరాన్ రాసుకొచ్చింది. దీనికి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోని ఫైట్ సీన్ క్లిప్‌ను యాడ్ చేసింది. విలన్లు వరుసగా బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే.. బాలయ్య కూర్చున్న చోటనే ఓ మ్యాన్ హోల్ మూతను అడ్డుపెట్టి బుల్లెట్ల నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్‌తో ఒకేసారి విలన్లను అంతం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను బాలీవుడ్ హీరో కాదని.. తెలుగు హీరో అంటూ కామెంట్లు పెట్టడంతో.. ఇరాన్ ఎంబసీ వారికి సరదాగా రిైప్లె ఇస్తోంది.
ఒమన్ సమీపంలోని హొర్ముజ్ వైపు నుంచి భారత్‌కు వస్తున్న ఎంవీ కేప్ డియో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారత నావికుడు మృతిచెందినట్లు మస్కట్‌లోని భారత ఎంబసీ బుధవారం వెల్లడించింది.