రూ. 2,700 క్యాన్సర్ మందుకు 27,000 ఎంఆర్పీనా?
మందుల తయారీదారులు రిటైలర్లకు విక్రయించే ధరకు, మందులపై ముద్రించే గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ)కి మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రూ. 2.700కు రిటైలర్ విక్రయించే క్యాన్సర్ మందుపై రూ. 27,000 ఎంఆర్పీ ముద్రించడాన్ని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితిని దోపిడీ కాకపోతే మరేమని పిలవాలని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు.
- ఇది పట్టపగలు దోపిడీయే!
- క్యాన్సర్ ఔషధాల అధిక ధరలపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : మందుల తయారీదారులు రిటైలర్లకు విక్రయించే ధరకు, మందులపై ముద్రించే గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ)కి మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రూ. 2.700కు రిటైలర్ విక్రయించే క్యాన్సర్ మందుపై రూ. 27,000 ఎంఆర్పీ ముద్రించడాన్ని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితిని దోపిడీ కాకపోతే మరేమని పిలవాలని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. మందుల ధరల నియంత్రణకు సంబంధించిన పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మందులు కొనుగోలు చేసేందుకు జనం తమ ఇళ్లు, ఆభరణాలు ఆమ్ముకొనే పరిస్థితులు ఉన్నాయని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు.
ఇంతటి ధరల వ్యత్యాసంపై సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పిటిషనర్ కిషన్ చంద్ జైన్ తన వాదనలో..డ్రగ్స్(ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్-2013లోని షెడ్యూల్-1లో ఉన్న సుమారు 1,000 మందులకు మాత్రమే గరిష్ఠ ధరలు నిర్ణయిస్తారని తెలిపారు. నాన్ షెడ్యూల్డ్ మందులకు తయారీదారులు ప్రారంభ ధరను స్వేచ్ఛగా నిర్ణయించే అవకాశం ఉన్నదన్నారు. అయితే ధర నిర్ణయించిన తర్వాత దానిని 10 శాతానికి మించి అమ్మకూడదనే నిబంధన ఉన్నదన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

